: హీరో విశాల్ కు గాయాలు.. హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు


సినిమా షూటింగ్ సందర్భంగా హీరో విశాల్ గాయపడ్డాడు. 'తుప్పరివాలన్' షూటింగ్ లో ఓ ఫైట్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తుండగా విశాల్ ఎడమ కాలికి గాయాలయ్యాయి. వెంటనే అతన్ని స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా విశాల్ ను చూసేందుకు భారీ ఎత్తున ఆయన అభిమానులు ఆసుపత్రి వద్దకు తరలి వచ్చారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

  • Loading...

More Telugu News