: 'భీమ్' యాప్ వినియోగదారులకు బంపర్ ఆఫర్


తమ వినియోగదారులకు భీమ్ యాప్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. డిజిటల్ లావాదేవాలను మరింత పెంచాలనే క్రమంలో యూజర్లకు భారీ మొత్తంలో క్యాష్ బ్యాక్ ఆఫర్లను అందించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ప్రధాని మోదీ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా గత డిసెంబర్ లో ఈ యాప్ ను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. భీమ్ యాప్ వాడుతున్న వారికి ప్రస్తుతం రూ. 10 నుంచి రూ. 25 మధ్యలో క్యాష్ బ్యాక్ ఆఫర్లు ఉన్నాయి. ఈ ప్రోత్సాహకాలను మరింత పెంచితే వినియోగదారుల సంఖ్య మరింత పెరుగుతుందని భీమ్ సీఈవో హోటా తెలిపారు. ఇప్పటికే ఈ ప్రోత్సాహకాల వివరాలను ప్రభుత్వానికి నివేదించామని... ప్రభుత్వం ఆమోదిస్తే ఆగస్ట్ 15వ తేదీ నుంచి అమల్లోకి తీసుకురావాలనుకుంటున్నట్టు చెప్పారు. 

  • Loading...

More Telugu News