: అభిమానులకు నాగచైతన్య 'రాఖీ' గిఫ్ట్... `యుద్ధం శరణం` సాంగ్ విడుదల
త్వరలో విడుదల కానున్న తన చిత్రం `యుద్ధం శరణం` సినిమాలోని ఓ పాటను రాఖీ బహుమతిగా అభిమానులకు నాగచైతన్య అందజేశాడు. ఈ సినిమాలోని `ఎన్నో ఎన్నో భావాలే` అనే పాట లిరికల్ వీడియోను నాగచైతన్య ట్విట్టర్‌లో షేర్ చేశాడు. ఈ పాటను దర్శకుడు కృష్ణ వైరముత్తుతో కలిసి రేడియో మిర్చిలో విడుదల చేసినట్లు ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
సినిమాలో నాగచైతన్యకు రాఖీ కడుతున్న సన్నివేశంతోనే ఈ వీడియో మొదలవుతోంది. కుటుంబ బంధాలను, వారితో గడిపిన సంతోష క్షణాలను ఈ వీడియోలో చూపించారు. నాగచైతన్య తల్లిదండ్రులుగా రావు రమేశ్, రేవతిలు నటించారు. అలాగే హీరోయిన్ లావణ్య త్రిపాఠికి, నాగచైతన్యకు మధ్య ఉన్న కొన్ని చక్కని సన్నివేశాలను కూడా ఈ వీడియోలో చూడొచ్చు. ఈ సినిమాలో నటుడు శ్రీకాంత్ ప్రతినాయక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.