: సెక్రటేరియట్ లో సోదరీమణులతో నారా లోకేష్ రాఖీ పండుగ వేడుక
అమరావతిలోని ఏపీ సెక్రటేరియట్ లో ఉన్న మంత్రి నారా లోకేష్ ఛాంబర్ ఈ రోజు చాలా సందడిగా మారింది. రాఖీ పండుగ సందర్భంగా ఆయనకు పలువురు మహిళా నేతలు రాఖీలు కట్టారు. ఆప్యాయంగా స్వీట్లు తినిపించారు. ఈ ఆనందాన్ని లోకేష్ ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. తనపై ఎంతో ప్రేమ, అభిమానాన్ని కురిపించే తన సోదరీమణులతో రాఖీ పండుగ వేడుక అని పేర్కొంటూ... కొన్ని ఫొటోలను ఆయన ట్విట్టర్లో అప్ లోడ్ చేశారు. సోదరసోదరీమణుల మధ్య ఉండే ప్రేమానురాగాలకు ప్రతీక అయిన రాఖీ పండుగ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు.