: రజనీకాంత్ ను ప్రత్యేకంగా కలిసిన బీజేపీ నేతలు మురళీధర్ రావు, పూనమ్ మహాజన్
సూపర్ స్టార్ రజనీకాంత్, రాజకీయాల్లోకి ప్రవేశించేందుకు రంగం సిద్ధమవుతోందని వార్తలు వస్తున్న వేళ, బీజేపీ నేతలు ఆయన ఇంటికి వెళ్లి మాట్లాడి రావడం కొత్త చర్చకు తెరలేపింది. బీజేపీ ఎంపీ పూనమ్ మహాజన్, ఆ పార్టీ నేత మురళీ ధర్ రావు రజనీ ఇంటికి వెళ్లారు. చెన్నైలో బీజేపీ తలపెట్టిన ఓ ర్యాలీకి హాజరయ్యేందుకు వచ్చిన పార్టీ నేతలు, ప్రత్యేకంగా రజనీ ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు. ఈ చర్చల వెనుక ఎటువంటి రాజకీయ ప్రాధాన్యం లేదని బీజేపీ వర్గాలు వెల్లడించినా, రజనీ కాంత్ బీజేపీతో కలుస్తారన్న ఊహాగానాలకు బలం మరింతగా పెరిగింది. ఇక రజనీ, ఆయన భార్య లత తదితరులతో తాను దిగిన ఫోటోలను ట్విట్టర్ లో పంచుకున్న పూనమ్, తాను కలుసుకున్న ఆత్మీయుల్లో లతాజీ, రజనీ జంట ఒకటంటూ వ్యాఖ్యానించారు.