: ఫ్లిప్‌కార్ట్ `ద బిగ్ ఫ్రీడం సేల్`.. ఆగస్టు 9 నుంచి 11 వరకు!
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ-కామర్స్ వెబ్‌సైట్లు పోటాపోటీగా ఆఫర్ల వర్షాన్ని కురిపిస్తున్నాయి. అమెజాన్ తరహాలోనే ఫ్లిప్‌కార్ట్ కూడా `ద బిగ్ ఫ్రీడం సేల్` పేరుతో భారీగా డిస్కౌంట్లు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందుకు సంబంధించిన తేదీలను ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది. ఆగస్టు 9 నుంచి 11 వరకు ఈ బిగ్ ఫ్రీడం సేల్ కొనసాగుతుందని ప్రకటించింది. ఈ సేల్‌లో టీవీలు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్లు, మొబైల్ ఫోన్లపై భారీగా ధరలు తగ్గించనున్నట్లు పేర్కొంది.
ఈ సేల్‌లో ప్రత్యేకంగా రెడ్‌మీ నోట్4 స్మార్ట్‌ఫోన్‌పై ఆఫర్లను అందుబాటులో ఉంచనుంది. అలాగే మోటో ఎం ఫోనును రూ. 12,999కి, మోటో జీ5 ప్లస్‌ను రూ.14,999కి అమ్మనున్నట్లు ప్రకటించింది. అలాగే లెనోవో కే5 నోట్ ఫోన్‌పై కూడా రూ. 3000 వరకు తగ్గింపును ఇవ్వనుంది. ఈ సేల్‌లో ప్రత్యేకంగా రూ. 67,000 విలువ గల గూగుల్ పిక్సెల్ ఎక్స్ఎల్ స్మార్ట్‌ఫోన్‌ను రూ. 48,999కే అందజేయనుంది. అంతేకాకుండా టీవీలు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్లపై కూడా భారీ తగ్గింపు ఉండనుందని ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది.