: తప్పు నాదే, జాగ్రత్త తీసుకోలేదు... సారీ!: హీరో మంచు విష్ణు
'ఆచారి అమెరికా యాత్ర' సినిమా షూటింగ్ సందర్భంగా బైక్ పై నుంచి పడి గాయాలపాలైన మంచు విష్ణు, ప్రస్తుతం తాను కోలుకున్నానని ట్విట్టర్ లో పేర్కొన్నాడు. ఎంతో మంది తాను ప్రమాదానికి లోనైన తరువాత తనకు ఫోన్లు చేశారని, తాను తీసుకోని ఓ చిన్న జాగ్రత్త కారణంగా తమ తల్లిదండ్రులకు, పిన్నికి, అక్కకు, తమ్ముడికి, అభిమానులకు బాధ కలిగించానని అన్నాడు. వారందరికీ సారీ చెప్పాల్సి వుందని చెప్పాడు. తన స్నేహితులు, శ్రేయోభిలాషులను కూడా క్షమాపణ కోరుతున్నానని, ఆ రోజు అసలేం జరిగిందన్న విషయమై తమ వద్ద ఉన్న వీడియో ఫుటేజ్ ని రెండు రోజుల్లో విడుదల చేస్తానని అన్నాడు. నేడు ఇలా అందరి ముందు మాట్లాడుతున్నానంటే, అది దేవుడిచ్చిన వరమేనని అభివర్ణించాడు మంచు విష్ణు.