: లక్నోలో చెట్లకు రాఖీలు కట్టిన చిన్నారులు!
పచ్చని చెట్లను తమ అన్నదమ్ములుగా భావిస్తూ, వాటికి రాఖీలు కట్టి ప్రేమను వ్యక్తం చేస్తున్నారు ఉత్తరప్రదేశ్‌లోని లక్నోకు చెందిన చిన్నారులు. పెద్ద పెద్ద రాఖీలు తయారు చేసి, తమ తల్లిదండ్రులతో కలిసి వేప, తుమ్మ వంటి చెట్లకు పిల్లలు రాఖీలు కడుతున్నారు. అంతేకాకుండా తాము చేయారు చేసిన రాఖీల మీద `చెట్లను నాటండి... పర్యావరణాన్ని కాపాడండి` అంటూ సందేశాలు కూడా రాశారు. చెట్టు కాండాన్ని శుభ్రంగా కడిగి, దానికి కుంకుమ బొట్టు పెట్టి, రాఖీలను కట్టి చెట్టును ఆలింగనం చేసుకుని తమ ప్రేమను చిన్నారులు వ్యక్తం చేస్తున్నారు.