: వెంకయ్యనాయుడిపై ట్వీట్ చేసి తిట్లు తిన్న కన్నడ నటుడు!
మరో నాలుగు రోజుల్లో భారత ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించనున్న ముప్పవరపు వెంకయ్యనాయుడిపై తన ట్విట్టర్ ఖాతాలో వ్యాఖ్యలు చేసిన కన్నడ నటుడు జగ్గేష్ పై విమర్శలు వెల్లువెత్తాయి. ఆయన చేసిన వ్యాఖ్యలు కన్నడిగులను అవమానించేలా ఉన్నాయని ఆరోపిస్తూ, నెటిజన్లు తిట్ల వర్షానికి దిగడంతో జగ్గేష్, తన ట్వీట్ ను తొలగించాల్సి వచ్చింది.
కర్ణాటకకు చెందని వ్యక్తిని రాష్ట్రం నుంచి రాజ్యసభకు పంపడంపై ప్రజలు గతంలో ఆందోళన చేశారని, ఇప్పుడదే వెంకయ్య ఉపరాష్ట్రపతిగా ఎంపికయ్యారని జగ్గేష్ ట్వీట్ చేయగా, పలువురు ఆగ్రహాన్ని వక్తం చేశారు. ఆయన పరోక్షంగా ప్రజలను అవమానించాడని ఎంతో మంది విమర్శించారు. కాగా, కన్నడిగుడు కాని వెంకయ్యను రాష్ట్రం నుంచి రాజ్యసభకు పంపాలని బీజేపీ గతంలో నిర్ణయించుకోగా, ప్రజల నుంచి తీవ్ర నిరసనలు రావడంతో, తన నిర్ణయాన్ని మార్చుకుందన్న సంగతి తెలిసిందే.