: విమానంలో బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన భారతీయ వైద్యుడి అరెస్టు
న్యూజెర్సీకి చెందిన యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానంలో 16 ఏళ్ల బాలికను నిద్రలో ఉండగా అసభ్యంగా తడిమినందుకు భారత్‌కు చెందిన వైద్యుడిని అమెరికా పోలీసులు అరెస్టు చేశారు. జూలై 23న ఒంటరిగా ప్రయాణిస్తున్న అమెరికాకు చెందిన బాలిక నిద్రలో ఉండగా భారతీయ వైద్యుడు విజయ్ కృష్ణప్ప అసభ్యంగా తడమడంతో ఆమె విమాన సిబ్బందికి ఫిర్యాదు చేసింది. దీంతో నేవార్క్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో దిగి విజయ్ తప్పించుకుని పారిపోయాడు. తర్వాత అతడిని అలా వెళ్లనిచ్చినందుకు బాలిక తల్లిదండ్రులు యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరా ఫుటేజీలు, ఫ్లైట్ మేనిఫెస్టోల ఆధారంగా పోలీసులు విజయ్‌ను పట్టుకుని, అరెస్ట్ చేశారు. మైనర్ బాలికను అసభ్యంగా తాకినందుకు అతడిపై నేవార్క్ పోలీసులు కేసు నమోదు చేశారు.