: కేటీఆర్, కవితలు ఇచ్చి పుచ్చుకున్న ప్రేమ కానుకలు ఇవే... వీడియో చూడండి.
రాఖీ పౌర్ణమి సందర్భంగా తెలంగాణ ఐటీ, మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కు, ఆయన చెల్లెలు, నిజామాబాద్ ఎంపీ కవిత రాఖీ కట్టారు. ఈ సందర్భంగా తన అన్నకు ఓ కొత్త హెల్మెట్ ను కవిత కానుకగా ఇచ్చారు. రహదారిపై టూ వీలర్ నడిపే సమయంలో హెల్మెట్ తప్పనిసరన్న విషయమై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఈ రాఖీ పండుగను ఉపయోగించుకుంటానని గతంలో కవిత వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇక తనకు రాఖీ కట్టి, ఆశీర్వాదం తీసుకున్న కవితకు, కేటీఆర్ ఓ చేనేత చీరను బహూకరించారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్, కవిత కుటుంబసభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అన్న పట్ల తన ప్రేమ, ఆప్యాయతలను చూపుతూ కవిత ఇచ్చిన హెల్మెట్ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అయింది.
#Sisters4Change #GiftAHelmet@RaoKavitha Gifted a Helmet to @KTRTRS on Raksha Bandan#HappyRakshaBandhan pic.twitter.com/EupRfmgAFj
— Vamsi Shekar PRO (@UrsVamsiShekar) August 7, 2017