: రంగంలోకి దిగిన రజనీకాంత్... రాజకీయాల్లోకి రావడం ఖాయం!
సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశం ఖరారైపోయినట్టుగా తెలుస్తోంది. కొత్త పార్టీ ఏర్పాటు సన్నాహకాల్లో భాగంగా రజనీ స్వయంగా రంగంలోకి దిగారని, పార్టీ ఏర్పాటుకు సన్నాహకాలు శరవేగంగా సాగుతున్నాయని సమాచారం. కొత్త పార్టీపై న్యాయ నిపుణులతో రజనీకాంత్ చర్చలు సాగిస్తున్నారని ఆయనకు అత్యంత సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. రాష్ట్ర, జాతీయ స్థాయి సిద్ధాంతాల రూపకల్పనపై కసరత్తు సాగుతోందని వారు వెల్లడించారు.
అతి త్వరలోనే కొత్త పార్టీపై ఎన్నికల కమిషన్ కు రజనీకాంత్ దరఖాస్తు చేస్తారని తెలిపారు. ప్రస్తుతం ఆయన హీరోగా నటిస్తున్న 'కాలా' ద్వారా అభిమానులకు ఆయన రాజకీయ సందేశం ఇవ్వనున్నారని పేర్కొన్నారు. ఇక 'కాలా' షూటింగ్ నిమిత్తం బిజీగా ఉంటూనే, వివిధ సంఘాలతో ఆయన సమావేశాలు కొనసాగిస్తున్నారని, అతి త్వరలోనే అభిమానులు ఎదురుచూస్తున్న ప్రకటన వెలువడుతుందని తెలిపారు.