: ఎవరూ వెనక్కు తగ్గట్లా... ఇది మంచి పధ్ధతి కాదు: మూడు చిత్రాలు ఒకే రోజు విడుదలపై సురేశ్ బాబు
ఈనెల 11న నితిన్ నటించిన ‘లై’, బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ‘జయ జానకి నాయక’, రానా హీరోగా తయారైన 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాలు విడుదలవనున్న నేపథ్యంలో నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు స్పందించారు. ఓ మోస్తరు సినిమాలు ఇలా ఒకే రోజున విడుదల కావడం మంచిది కాదని అభిప్రాయపడ్డ ఆయన, థియేటర్ల విషయంలో సమస్యలు ఉన్నాయని, ఎవరూ వెనక్కి తగ్గడం లేదని అన్నారు. ఈ తరహా పోటీ వల్ల పరిశ్రమకు నష్టం వాటిల్లే ప్రమాదముందని తెలిపారు.
ఇక రానా నటించిన చిత్రం ఓ క్లాసికల్ మూవీలా అనిపించిందని, కొన్ని సన్నివేశాల్లో తనకు కళ్లవెంట నీళ్లొచ్చాయని అన్నారు. లక్ష్య సాధనలో దారి తప్పిన యువకుడు, తన తప్పును ఏ విధంగా సరిదిద్దుకున్నాడన్న కథాంశంతో చిత్రం తయారైందని తెలిపారు. తమిళంలో అజిత్ కొత్త చిత్రం విడుదల 11వ తేదీన ఉంటే, తాను ఈ చిత్రాన్ని రెండు వారాల పాటు వాయిదా వేసి ఉండేవాడినని సురేశ్ బాబు అన్నారు. చిత్రం విడుదలకు ముందే సేఫ్ జోన్ లోకి వచ్చేసిందని తెలిపారు.