venkatesh: భారీ విజువల్ ఎఫెక్ట్స్ తో వెంకటేశ్ మూవీ!

ఈ మధ్య కాలంలో కథల ఎంపిక విషయంలో వెంకటేశ్ మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. కొత్తగా కనిపిస్తూ యువతరం హీరోలతో పోటీ పడటానికి అవసరమైన కథా సామగ్రి ఉంటేనే తప్ప ఆయన రంగంలోకి దిగడం లేదు. అలాంటి వెంకటేశ్ ఈ సారి పూర్తి విభిన్నమైన కథాంశాన్ని ఎంచుకున్నట్టు సురేశ్ బాబు మాటల వలన తెలుస్తోంది.
తనకీ .. వెంకటేశ్ కి ఒక కొత్త దర్శకుడు ఒక కథ వినిపించాడనీ .. కథ చాలా కొత్తగా ఉందని ఆయన అన్నారు. జంతువుల నేపథ్యంలో ఈ కథ కొనసాగుతుందని చెప్పారు. ఈ కథకి భారీ స్థాయిలో విజువల్ ఎఫెక్ట్స్ అవసరమవుతున్నాయని అన్నారు. ఇటు కథ పైనా .. విజువల్ ఎఫెక్ట్స్ కి సంబంధించిన విషయాల పైన కసరత్తు జరుగుతోందని చెప్పారు. త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడి చేస్తామని అన్నారు.