: ఇంట్లో ఏసీ, ఫ్రిజ్ ఉంటే అన్ని రాయితీలూ కట్... సంచలన నిర్ణయం తీసుకోనున్న మోదీ సర్కారు!
మీకు నాలుగు గదుల ఇల్లుందా? లేదా కారుందా? లేదా ఇంట్లో ఏసీ, ఫ్రిజ్ ఉన్నాయా? ద్విచక్రవాహనం, వాషింగ్ మెషీన్ వంటి వాటిని వాడుతున్నారా? అయితే, కేంద్ర ప్రభుత్వం అందించే సబ్సిడీ పథకాలను అందుకో లేరు. సాంఘిక ఆర్థిక సర్వేలో భాగంగా పట్టణ ప్రాంతాల్లో పైన పేర్కొన్న వస్తువులు ఉంటే సంక్షేమ పథకాలను అందుకోలేరని కేంద్రం నియమించిన దేబ్రాయ్ కమిటీ బాంబులాంటి వార్తను పేల్చింది.
ఇక దేబ్రాయ్ కమిటీ ఇచ్చిన సిఫార్సులను అమలు చేయాలని కేంద్రం కూడా భావిస్తోంది. సొంత ఇల్లు లేనివారు, పాలిథిన్ కవర్ల గుడిసెల్లో నివాసం ఉన్నవారు, ఎలాంటి ఆదాయం లేని వారు, మగతోడు లేని వారు, పిల్లలు మాత్రమే సంక్షేమ పథకాలు పొందేందుకు అర్హులని తేల్చింది. దేబ్రాయ్ కమిటీ నివేదిక ప్రకారం, పట్టణాల్లో ఉంటూ గ్యాస్ రాయితీ నుంచి వివిధ రకాల సంక్షేమ, సబ్సిడీలను అందుకుంటున్న వారిలో 41 శాతం మంది అనర్హులని ఈ కమిటీ పేర్కొంది.