: మీ పాన్ కార్డు యాక్టివా? డీయాక్టివా?... పనికిరాకుండా పోయిన 11.44 లక్షల కార్డులు!
దేశవ్యాప్తంగా 11.44 లక్షల పాన్ కార్డులు పనికిరాకుండా పోయాయి. ఆగస్టు 31వ తేదీ లోపు ఆధార్ కార్డుతో అనుసంధానం కాని పాన్ కార్డుల్లో 11.44 లక్షల కార్డులను కేంద్రం డీయాక్టివేట్ చేసింది. మరికొన్నింటిని డిలీట్ కూడా చేసింది. ఆగస్టు నెలాఖరులోగా పాన్, ఆధార్ లింక్ కాబడని పాన్ కార్డులు చెల్లబోవని ఆర్థిక మంత్రిత్వ శాఖ గతంలోనే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
ఒకవేళ మీ కార్డు యాక్టివ్ గా ఉందో లేక డీయాక్టివ్ అయిందో తెలుసుకోవాలంటే, ఆదాయపు పన్ను విభాగం ఇ- ఫైల్లింగ్ వెబ్ సైట్ ను ఓపెన్ చేసి, 'Know Your Pan' అనే ఆప్షన్ పై క్లిక్ చేసి, వివరాలు సబ్ మిట్ చేస్తే, మీ ఫోన్ నంబరుకు ఓ వన్ టైమ్ పాస్ వర్డ్ వస్తుంది. దానిని ఎంటర్ చేసిన తరువాత, మీ పాన్ కార్డు డీ యాక్టివేట్ కాకుంటే ‘యాక్టివ్’ అన్న మెసేజ్ వస్తుంది. అది రాకుంటే, మీ పాన్ కార్డు డీయాక్టివేట్ అయినట్టు. ఒకవేళ డీ యాక్టివేట్ అయిన కార్డులను తిరిగి యాక్టివేట్ చేసుకునే విధానంపై కేంద్రం నుంచి ఇంకా స్పష్టత రాలేదు. వారు మరో కార్డు తీసుకోవాలా? లేక ఆధార్ అనుసంధానం చేసుకుంటే సరిపోతుందా? అన్న విషయాన్ని కేంద్రం స్పష్టం చేయాల్సి వుంది.