: అమర్‌నాథ్ దాడి ఘటనలో ముగ్గురు ఉగ్రవాదుల అరెస్ట్
జమ్మూకాశ్మీర్ లో అమర్ నాథ్ యాత్రికులపై దాడులకు పాల్పడ్డ ఘటనలో ఉగ్రవాదులకు సాయపడ్డ అనుమానిత ఉగ్రవాదులను పోలీసులు అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. బిలాల్ అహ్మద్ రేషి, ఐజాజ్ వాగే, జమూర్ అహ్మద్ అనే ముగ్గురు అనుమానిత ఉగ్రవాదులను అరెస్టు చేశామన్నారు.
ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన నలుగురు ఉగ్రవాదులకు వీరు ఆశ్రయం కల్పించారని చెప్పారు. ఆశ్రయం పొందిన ఉగ్రవాదులు అమర్ నాథ్ యాత్ర ముగించుకుని వెళ్తున్న యాత్రికుల బస్సుపై దాడికి పాల్పడ్డారు. అమర్‌నాథ్ యాత్ర ముగించుకుని వెళ్తున్న యాత్రికుల బస్సుపై అనంతనాగ్ జిల్లాలో జూలై 10న విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడ్డారు. ఈ సంఘటనలో ఆరుగురు భక్తులు మృతి చెందగా, చికిత్స పొందతూ మరో ఇద్దరు యాత్రికులు చనిపోయారు.