: మంత్రి తుమ్మలను పరామర్శించిన కేసీఆర్
అల్సర్ కారణంగా అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్న తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును సీఎం కేసీఆర్ పరామర్శించారు. హైదరాబాద్ సోమాజీగూడలోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన్ని కేసీఆర్ ఈ రోజు పరామర్శించారు. త్వరగా కోలుకోవాలని, తగినంత విశ్రాంతి తీసుకోవాలని తుమ్మలతో కేసీఆర్ చెప్పారు. తుమ్మలకు చికిత్స అందుతున్న తీరు గురించి వైద్యులను కేసీఆర్ అడిగారు. కాగా, రెండు రోజుల క్రితం అస్వస్థతకు గురైన ఆయనకు రక్తపు వాంతులు అయ్యాయి. జ్వరం రావడంతో పాటు, రక్తపోటులో హెచ్చుతగ్గులు చోటుచేసుకున్నాయి.