: నా దృష్టిలో తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే... : హీరోయిన్ కాజల్


తేజ దర్శకత్వంలో రూపొందుతున్న ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రం ద్వారా తన 50వ సినిమాను హీరోయిన్ కాజల్ పూర్తి చేసుకోనుంది. ఈ నేపథ్యంలో ఓ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, ఈ చిత్రం చాలా స్పెషల్ ఫిల్మ్ అని, దీని కథ, స్క్రిప్ట్...అన్నీ ప్రత్యేకమేనని, చెప్పింది. ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా పాలిటిక్స్ గురించి చెప్పేందుకు తీసిన సినిమా కాదని, భార్యాభర్తల మధ్య ప్రేమ బంధం, వారి ప్రయాణం గురించి ఇందులో ఉంటుందని చెప్పింది.

ఇంకా, ఈ సినిమాకు సంబంధించిన పలు విషయాలను చెప్పింది. సుమారు యాభై మందికి పైగా హీరోలతో తాను నటించానని, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి నటించిన చిత్రాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పింది. తన దృష్టిలో తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే...‘సొంతిల్లు’ లాంటిదని, బాలీవుడ్ అంటే ‘వెకేషన్ హోమ్’ అని ఓ ప్రశ్నకు సమాధానంగా కాజల్ చెప్పింది. స్పెషల్ సాంగ్స్ లో నటించడం తప్పేమీ కాదని, దీనిని భూతద్దంలో చూడకూదడని చెప్పింది. ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో గడపడం, మ్యూజిక్ వినడం, బుక్ రీడింగ్ చేయడం.. మొదలైనవి పాటించడంతో స్ట్రెస్ లేకుండా చూసుకుంటానని కాజల్ చెప్పింది.

  • Loading...

More Telugu News