: హైదరాబాద్ లో దారుణం.. మహిళపై గ్యాంగ్ రేప్!
హైదరాబాద్ లో దారుణం జరిగింది. ఓ మహిళకు మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చి ఆమెపై అత్యాచారానికి పాల్పడిన సంఘటన కాచిగూడలో జరిగింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటన రెండు రోజుల క్రితం జరిగింది. సదరు మహిళ స్పృహలోకి వచ్చిన తర్వాత కాచిగూడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. కాగా, ఈ సంఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.