: యూపీలో అనుమానిత ఉగ్రవాది అరెస్టు!


ఉత్తరప్రదేశ్ లో అనుమానిత ఉగ్రవాదిని పోలీసులు అరెస్టు చేశారు. ఉగ్రవాద కార్యకలాపాలకు సాయం చేస్తున్నాడనే అనుమానంతో బంగ్లాదేశ్ కు చెందిన అబ్దుల్లాను ముజఫర్ నగర్ లోని కుటేసరా ప్రాంతంలో అరెస్టు చేశారు. ఒక నెల క్రితం దియోబంద్ ప్రాంతానికి వచ్చి ఇక్కడే నివసిస్తున్నాడని, అతని నకిలీ పాస్ పోర్టు, ఆధార్ కార్టులు లభ్యమయ్యాయని పోలీసులు తెలిపారు. భారత్ లోకి అక్రమంగా చొరబడే ఉగ్రవాదులకు అబ్దుల్లా సహాయపడుతున్నాడని, వారి కోసం నకిలీ ఆధార్ కార్డులు, పాస్ పోర్టులు తయారు చేస్తున్నాడని తెలిసిందని పోలీసులు తెలిపారు. కాగా, బంగ్లాదేశ్ తీవ్రవాద సంస్థ అన్నరుల్లా బంగ్లా టీంతో అబ్దుల్లాకు సంబంధాలు ఉన్నట్లు సమాచారం. ఉగ్రవాద సంస్థ అల్ ఖైదా ఆదేశాల ప్రకారం అన్నరుల్లా బంగ్లా టీం నడచుకుంటుందని అధికారుల సమాచారం.

  • Loading...

More Telugu News