: తనయుడు తప్పు చేస్తే శిక్ష తండ్రికా?: హర్యానా బీజేపీ చీఫ్ బరాలాకు సీఎం బాసట
హర్యానా బీజేపీ చీఫ్ సుభాష్ బరాలాకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఖట్టర్ మద్దతుగా నిలిచారు. ఓ యువతిపై లైంగిక వేధింపుల కేసులో బరాలా కుమారుడు వికాస్ బరాలాను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ప్రతిపక్షాలు సుభాష్ బరాలాను లక్ష్యంగా చేసుకుని విమర్శల దాడికి దిగాయి. దీనిపై ఖట్టర్ స్పందిస్తూ కొడుకు తప్పు చేస్తే తండ్రిని శిక్షించడం సరికాదని అన్నారు.
ఇది బరాలా కుమరుడికి సంబంధించినది, ఈ విషయంలో పోలీసులు చట్టపరంగా చర్యలు తీసుకుంటారని తాను భావిస్తున్నట్టు చెప్పారు. గత శుక్రవారం రాత్రి చండీగఢ్ లో వికాస్ తన స్నేహితుడు ఆశిష్ తో కలిసి మద్యం మత్తులో తమ వాహనం నుంచే కారులో వెళుతున్న ఓ యువతిని వెంబడించిన విషయం తెలిసిందే.