: దినకరన్ కు షాక్.. పార్టీ ఆఫీసుకు వస్తే అరెస్ట్ చేయాలని సీఎం పళనిస్వామి ఆదేశం!
తమిళనాడు రాజకీయవర్గాల్లో, ముఖ్యంగా అన్నాడీఎంకే పార్టీలో ఉత్కంఠభరిత వాతావరణం నెలకొంది. శశికళ బంధువు, పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్ పార్టీ కార్యాలయానికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. తనను ఎవరు ఆపుతారో చూస్తానంటూ సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్నాడీఎంకే పార్టీ కార్యాలయం వద్ద పోలీసు భద్రతను పెంచారు. ఒకవేళ దినకరన్ పార్టీ కార్యాలయానికి వస్తే, అరెస్ట్ చేయాలంటూ ముఖ్యమంత్రి పళనిస్వామి ఆదేశాలు జారీ చేశారు. దినకరన్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ కార్యాలయంలోకి అడుగుపెట్టనివ్వబోమని పళనిస్వామి, పన్నీర్ సెల్వం వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి.