: అమెరికా కన్నెర్ర చేస్తే ఏ దేశానికైనా వణుకు పుడుతుంది: లియోన్ పెన్నేటా


అమెరికాను భయపెట్టేందుకు ఉత్తర కొరియా చేసే ప్రయత్నాలు రానున్న రోజుల్లో మరింత పెరుగుతాయని వైట్ హౌస్ సిబ్బంది వ్యవహారాల మాజీ కార్యదర్శి లియోన్ పెన్నేటా అన్నారు. అయితే, ఉత్తర కొరియా బెదిరింపులకు అమెరికా తలొగ్గదని... అమెరికా కన్నెర్ర చేస్తే ప్రపంచంలోని ఏ దేశానికైనా వణుకు పుడుతుందని ఆయన చెప్పారు. ఒకే నెలలో రెండు న్యూక్లియర్ క్షిపణులను పరీక్షించిన ఉత్తర కొరియా ఇంతటితో ఆగుతుందని తాను భావించడం లేదని అన్నారు.

ఎంతో టెక్నాలజీ ఉంటేనే ఓ చిన్న దేశం అమెరికాతో తలపడేందుకు సిద్ధపడుతుందని ఉత్తర కొరియాను ఉద్దేశించి చెప్పారు. ఉత్తర కొరియా వెనుక చైనా హస్తం ఉన్న మాట నిజమే అయినా... ఆ దేశం ఎన్నాళ్లు ఉత్తర కొరియాకు సహాయం చేస్తుందని ప్రశ్నించారు. చైనా ప్రయోజనాలకు భంగం కలగనంత వరకే ఈ దేశాల మధ్య సంబంధాలు ఉంటాయని చెప్పారు. అమెరికాతో యుద్ధం చేయమంటూ ఉత్తర కొరియాను ప్రోత్సహిస్తున్న చైనా.. తీరా ఆ సమయం వచ్చే సరికి వెన్ను చూపుతుందని జోస్యం చెప్పారు. 

  • Loading...

More Telugu News