: అచ్చం జియోను పోలిన ఆఫర్‌ను ప్రకటించిన ఎయిర్‌టెల్‌.. రూ.399తో 84 జీబీ డేటా!


రిలయన్స్ జియో నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకునేందుకు టెలికం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం  అచ్చం జియోను పోలిన రూ.399 ప్లాన్‌ను ప్రకటించింది. ఈ  ప్లాన్‌లో భాగంగా వినియోగదారులు రోజుకు 1జీబీ 4జీ డేటాను 84 రోజులపాటు పొందవచ్చు. అయితే 4 జీ హ్యాండ్‌సెట్స్ కలిగి, 4జీ సిమ్ ఉన్న వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది.

స్పెషల్, కమర్షియల్, ఎంటర్‌ప్రైస్ పర్పస్ కోసం ఉపయోగించే వారి కోసం ఈ పథకం వర్తించదని పేర్కొంది. అలాగే ఇతర ప్లాన్‌తో కలపడానికి కూడా కుదరదని వివరించింది. ఈ ప్లాన్‌లో భాగంగా లోకల్, ఎస్టీడీ కాల్స్‌ను అపరిమితంగా చేసుకోవచ్చు.
రూ.399 ప్లాన్‌తోపాటు ఎయిర్‌టెల్ రూ.244 ప్లాన్‌ను కూడా ప్రకటించింది. ఇందులో భాగంగా రోజుకు 1జీబీ డేటాను 70 రోజులపాటు పొందే వీలుంది.  అయితే ఉచిత కాల్స్ మాత్రం ఎయిర్‌టెల్ పరిధిలో మాత్రమే చేసుకోవాల్సి ఉంటుంది.  

  • Loading...

More Telugu News