: కట్టూ, బొట్టూ లేని నువ్వా, సంప్రదాయాల గురించి మాట్లాడేది?: అఖిలప్రియపై రోజా విమర్శలు


తెలుగువారి ఆత్మగౌరవం పేరుతో తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ స్థాపించారని... అలాంటి పార్టీలో ఉంటూ కనీసం కట్టూ, బొట్టూ, చీర కూడా లేకుండా, మగాడిలా చుడీదార్ వేసుకుని వెళ్లే నీవు కూడా సంప్రదాయాల గురించి మాట్లాడతావా? అంటూ మంత్రి అఖిలప్రియపై వైసీపీ ఎమ్మెల్యే రోజా ధ్వజమెత్తారు. నీ ప్రవర్తన వల్ల మహిళలు సిగ్గుతో తల వంచుకునే పరిస్థితి తలెత్తిందని మండిపడ్డారు. మీ తండ్రికి పెద్ద కర్మ చేయడానికి సమయం లేదు, నంద్యాలలో సంతాపసభ పెట్టడానికి సమయం లేదు కానీ... పదవుల కోసం ఆరాటపడుతూ, మా అమ్మానాన్నలు చనిపోయారని చెబుతూ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నావంటూ విమర్శించారు.

శోభానాగిరెడ్డి పార్టీ మారినప్పుడు తన పదవికి రాజీనామా చేశారని అన్నారు. శోభానాగిరెడ్డి ఆశయాలకు తూట్లు పొడిచే విధంగా ప్రవర్తిస్తున్నావంటూ మండిపడ్డారు. నీ తల్లి చనిపోయినప్పుడు చూడ్డానికి కూడా చంద్రబాబు రాలేదని, నీ తండ్రి మరణానికి చంద్రబాబే కారణమని... అలాంటి చంద్రబాబుకు పదవులకోసం అండగా ఉంటున్న నీవా జగన్ గురించి మాట్లాడేది? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

  • Loading...

More Telugu News