: హెల్మెట్లు ఇలా కూడా పనికొస్తాయన్నమాట.. వైరల్ అవుతున్న ఈ వీడియోను చూడండి!
హెల్మెట్లు ఇలా కూడా పనికొస్తాయని నిరూపిస్తున్నారు ఉత్తరప్రదేశ్ మహిళలు. ఢిల్లీ శివారు గ్రామంలో ఇటీవల మహిళల జడలను కత్తిరించేస్తున్న ఘటనలు ఎక్కువ కావడంతో బయటకు వచ్చేందుకు యువతులు భయపడుతున్నారు. బయటకొస్తే జడను ఎక్కడ కోల్పోవాల్సి వస్తుందో అని ఇళ్లకు గడియలు పెట్టుకుని లోపలే ఉండిపోతున్నారు. తాజాగా జడల కత్తిరింపు ఉత్తరప్రదేశ్‌కూ పాకడంతో దుండగుల నుంచి తమ జుత్తును కాపాడుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.
ముఖ్యంగా భాగ్‌పట్ జిల్లాలోని బారౌట్ గ్రామ మహిళలు వినూత్నంగా తమ జడను కాపాడుకుంటున్నారు. తాము నిద్రించే సమయంలో ఎవరూ తమ జడను కత్తిరించకుండా ఉండేందుకు ఏకంగా హెల్మెట్లు పెట్టుకుని నిద్రపోతున్నారు. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు బయటపడి వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోను మీరూ చూడండి.