: టీడీపీ తీర్థం పుచ్చుకోనున్న మంత్రి కామినేని శ్రీనివాస్? బీజేపీకి గుడ్ బై?


ఏపీ మంత్రి, బీజేపీ నేత కామినేన్ శ్రీనివాస్ టీడీపీలో చేరనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆయన బీజేపీకి గుడ్ బై చెప్పడం ఖాయమని చెబుతున్నారు. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో విచిత్రమైనటువంటి పరిస్థితి నెలకొంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో ఇటు టీడీపీ, అటు వైసీపీ రెండూ కలిసే ఉంటున్నాయి. బీజేపీతో పూర్తి స్థాయిలో పొత్తు పెట్టుకోవడానికి వైసీపీ ఉవ్విళ్లూరుతోంది. ఈ నేపథ్యంలో, రానున్న రోజుల్లో ఒకవేళ బీజేపీతో టీడీపీ తెగదెంపులు చేసుకుంటే... కామినేని తన మంత్రి పదవిని కోల్పోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే, ఆయన టీడీపీలోకి చేరాలని భావిస్తున్నట్టు సమాచారం.

టీడీపీలోకి చేరితే, తన మంత్రి పదవికి ఢోకా ఉండదనేది కామినేని అభిప్రాయంగా తెలుస్తోంది. మరోవైపు, తనకు బీజేపీని వీడాలన్న ఆలోచన ఏమాత్రం లేదని ఆయన బయటకు చెబుతున్నారు. బీజేపీ సిద్ధాంతాలను తాను ఇష్టపడతానని, పార్టీని వీడే ప్రసక్తే లేదని ఆయన అంటున్నారు. అయితే, రాజీకీయాల్లో ఏదీ శాశ్వతం కాదని... కామినేని టీడీపీలో చేరినా, ఆశ్చర్యం లేదని కొందరు అంటున్నారు. ఈ నేపథ్యంలో, రాబోయే రోజుల్లో ఏమి జరుగబోతోందో, వేచి చూడాలి.  

  • Loading...

More Telugu News