: వెంకయ్యనాయుడుగారూ! కంగ్రాట్యులేషన్స్: చంద్రబాబు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విజయం సాధించిన ఎన్డీఏ అభ్యర్థి ఎం.వెంకయ్యనాయుడుకు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేశ్ అభినందనలు తెలిపారు. తమ ట్విట్టర్ ఖాతాల ద్వారా వారు వేర్వేరుగా పోస్ట్ లు చేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విజయం సాధించిన వెంకయ్యనాయుడుకి కంగ్రాట్స్ చెబుతున్నానని, ఎంతో గొప్ప విజయం సాధించారని అన్నారు. కొత్త బాధ్యతలను స్వీకరించి విజయవంతమైన ప్రయాణాన్ని కొనసాగించాలని చంద్రబాబు కోరారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విజయభేరి మోగించిన వెంకయ్యనాయుడుకు తన హృదయపూర్వక శుభాకాంక్షలు చెబుతున్నానని మంత్రి నారా లోకేశ్ అన్నారు.