: ముంబైలో ప్రారంభమైన మోటార్ బైక్ అంబులెన్స్ సేవలు!
సత్వర మెడికల్ సదుపాయం కల్పించేందుకు వీలుగా ముంబై నగరంలో మోటార్ బైక్ అంబులెన్స్ సర్వీసులను మహారాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. అంబులెన్స్ వెళ్లలేని ప్రాంతాలకు వెళ్లేందుకు వీలుగా ఈ మోటార్ బైక్ అంబులెన్స్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. 108 అత్యవసర నంబర్ ద్వారానే ఈ బైక్ అంబులెన్స్ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు.
పైలట్ ప్రాజెక్టు కింద 10 మోటార్ బైక్ అంబులెన్స్‌లను మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాక్రేలు ప్రారంభించారు. ట్రాఫిక్ అధికంగా ఉన్న సమయంలో ఈ బైక్ అంబులెన్స్ లు బాగా ఉపయోగపడతాయని మహారాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది. ఈ సేవల కోసం రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లను ఉపయోగించినట్లు వీటిని నడుపుతున్న భారత్ వికాస్ గ్రూప్ ప్రతినిధి తెలియజేశారు.