: నంద్యాల వ్యాఖ్యల ఎఫెక్ట్.. ఈసీ ఆదేశాల మేరకు జగన్ కు షోకాజ్ నోటీసు


నంద్యాల బహిరంగ సభలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన వైసీపీ అధినేత జగన్ కు ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు షోకాజ్ నోటీసు జారీ అయింది. ఈ మేరకు కలెక్టర్ సత్యనారాయణ షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఇరవై నాలుగు గంట్లలోగా సమాధానం చెప్పాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. కాగా, నంద్యాలలో జగన్ చేసిన వ్యాఖ్యలను ఎన్నికల సంఘం సుమోటోగా తీసుకుని స్పందించింది. ఈ నేపథ్యంలో కలెక్టర్ సత్యనారాయణ నుంచి ఎన్నికల ప్రధానాధికారి భన్వర్ లాల్ వివరణ కోరారు. నిబంధనలు ఉల్లంఘించినట్టు తేలితే జగన్ కు షోకాజ్ నోటీసు జారీ చేయాలని కలెక్టర్ ను ఆదేశించారు.

  • Loading...

More Telugu News