: టాయ్‌లెట్ పేప‌ర్ల‌పై ట్రంప్ ట్వీట్లు ముద్రించిన కంపెనీ!


సాధార‌ణంగా అమెరిక‌న్లు ఉప‌యోగించే టాయ్‌లెట్ టిష్యూ పేప‌ర్ మీద ఎలాంటి రాత‌లు ఉండ‌వు. ఇందుకు భిన్నంగా టాయ్‌లెట్ ట్వీట్స్ అనే టిష్యూ పేప‌ర్ త‌యారీ కంపెనీ టాయ్‌లెట్ పేప‌ర్లపై అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ల‌ను ముద్రించి అమెజాన్‌ వెబ్‌సైట్‌లో అమ్మ‌కానికి పెట్టింది. అమ్మ‌కం మొద‌లైన కొన్ని గంట‌ల్లోనే స్టాక్ అయిపోయిందని, ఈ టాయ్‌లెట్ పేప‌ర్ల‌కు మంచి డిమాండ్ వచ్చిందని వారి ట్విట్ట‌ర్ అకౌంట్‌లో పేర్కొంది. డొనాల్డ్ ట్రంప్ చేసిన ట్వీట్ల‌ నుంచి 10 ప‌ర‌మ చెత్త ట్వీట్ల‌ను ఎంపిక చేసుకుని ఈ పేప‌ర్ల‌పై ముద్రించిన‌ట్లు కంపెనీ తెలిపింది. 'ఈ ట్వీట్ల‌న్నీ ఫ్ల‌ష్ చేయ‌డానికి సిద్ధంగా ఉన్నాయ్! ఆల‌స్యం చేయ‌కుండా కొనుక్కోండి..' అంటూ ప్ర‌చారాలు కూడా మొద‌లు పెట్టింది.

  • Loading...

More Telugu News