: ముగిసిన ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్


ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఈ రోజు ఉదయం పది గంటలకు ప్రారంభమైన ఎన్నికల పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. పార్లమెంట్ ఉభయ సభల్లో మొత్తం 790 మంది సభ్యులు ఉండగా..లోక్ సభలో రెండు ఎంపీ స్థానాలు, రాజ్యసభలో రెండు ఎంపీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. కోర్టు తీర్పు కారణంగా బీజేపీ ఎంపీ సీహెచ్ పాశ్వాన్ ఓటింగ్ లో పాల్గొనలేదు. దీంతో ప్రస్తుత పార్లమెంట్ సభ్యుల సంఖ్య 785.

యూపీ, గోవా ముఖ్యమంత్రులుగా బాధ్యతలు చేపట్టిన యోగి ఆదిత్యనాథ్‌, మనోహర్‌ పారికర్‌లు ఇంకా పార్లమెంట్‌ సభ్యులుగా కొనసాగుతుండటంతో వారు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నామినేటెడ్‌ సభ్యులు సచిన్‌, రేఖ, మేరీకోమ్‌లూ ఈ ఎన్నికల్లో ఓటు వేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్టీఏ అభ్యర్థిగా ఎం.వెంకయ్యనాయుడు, ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా మహాత్మాగాంధీ మనవడు గోపాలకృష్ణ గాంధీ పోటీ చేశారు. 

  • Loading...

More Telugu News