: ప్రధాని మోదీ, యూపీ సీఎం ఆదిత్యానాథ్‌లకు రాఖీలు పంపిన ముస్లిం మహిళలు
ట్రిపుల్ తలాక్ విషయంలో తమ బాగుకోసం గొంతు కలిపినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌లకు ఉత్తరప్రదేశ్ ముస్లిం మహిళలు రాఖీలు పంపించారు. ట్రిపుల్ తలాక్ సామాజిక నేరమని, దీన్ని రాజకీయం చేయకుండా ఒక పరిష్కారం సూచించాలని ప్రధాని మోదీ గతంలో ముస్లిం పెద్దలను పలుమార్లు కోరారు.
మూడు సార్లు తలాక్ అనే పదాన్ని చెవిలో చెప్పడం ద్వారా విడాకులు ఇచ్చే ట్రిపుల్ తలాక్ సంప్రదాయాన్ని ముస్లిం మహిళలు వ్యతిరేకించారు. వారి హక్కులకు భంగం కలిగేలా ఉన్న ట్రిపుల్ తలాక్, నిఖ్ఖా హాలా (బహుభార్యత్వం) పద్ధతులను తొలగించడానికి ప్రధాని మోదీ, సీఎం ఆదిత్యానాథ్‌లు చాలా కృషి చేశారు. ఈ కేసుకు సంబంధించిన తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్‌లో ఉంచింది.