: ఆరోపణల కేసులో ఆప్ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ అరెస్టు


ప్రభుత్వ ఆస్తులను పాడు చేస్తున్నారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్నఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఆరోపణల నేపథ్యంలో ఆయనపై పోలీసులు ఇటీవల కేసు నమోదు చేశారు. అయితే, సురేంద్రసింగ్ విచారణ నిమిత్తం కోర్టుకు హాజరుకాకపోవడంతో పోలీసులు ఈ రోజు అరెస్టు చేశారు. అనంతరం, పటియాలా కోర్టులో హాజరుపరచగా, ఈ నెల 17 వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించారు. ఇదిలా ఉండగా, హోర్డింగ్ లు, పోస్టర్లు అతికిస్తూ ప్రభుత్వ ఆస్తులను పాడుచేస్తున్నారంటూ ఢిల్లీలోని కంటోన్మెంట్ నియోజకవర్గం ఎమ్మెల్యే  సురేంద్ర సింగ్ పై నార్నియా ప్రాంత వాసులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

  • Loading...

More Telugu News