: హీరో ఆది ‘నెక్స్ట్ నువ్వే’ ఫస్ట్ లుక్ విడుదల
హీరో ఆది, వైభవీ శాండిల్య జంటగా వీ4 మూవీస్ సంస్థ నిర్మిస్తున్న చిత్రానికి ‘నెక్స్ట్ నువ్వే’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ చిత్రానికి 'ఈటీవీ' ప్రభాకర్ దర్శకత్వం వహిస్తుండగా బన్నీ వాసు ప్రొడ్యూసర్ గా ఉన్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను ఈ రోజు విడుదల చేశారు. ఈ దసరా పండగకు ఈ చిత్రాన్ని విడుదల చేసే ప్రయత్నాల్లో చిత్ర బృందం ఉన్నట్టు సమాచారం. కాగా, హర్రర్-కామెడీ నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.