: నేను నిర్దోషిని.. భయపడాల్సిన అవసరం లేదు: సత్యంబాబు


ఆయేషా మీరా హత్య కేసులో సత్యంబాబును నిర్దోషిగా ప్రకటిస్తూ కొన్ని నెలల క్రితం కోర్టు తీర్పు నిచ్చిన విషయం విదితమే. అయితే, ఈ కేసు పునర్విచారణకు ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో సత్యంబాబు మీడియాతో మాట్లాడుతూ, ఈ కేసుతో తనకు ఎటువంటి సంబంధం లేకపోవడంతో తనను నిర్దోషిగా ప్రకటిస్తూ మూడు నెలల క్రితం హైకోర్టు తీర్పు నిచ్చిందని అన్నాడు. తాను నిర్దోషిని కనుక, మళ్లీ విచారణ జరిపినా కూడా భయపడనని, ఆయేషా మీరా తల్లిదండ్రులు కూడా తనను నిర్దోషి అని చెబుతున్నారని అన్నాడు.

ఈ రోజున తాను బయట తిరుగుతున్నానంటే దానికి కారణం, ఎటువంటి తప్పు చేయకపోవడమేనని చెప్పాడు. కాగా, 2007లో కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో ఆయేషా మీరా హత్యకు గురైంది. ఈ కేసులో చాలామంది పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ, సత్యంబాబుకి శిక్ష పడింది. అయితే, ఈ కేసులో సత్యంబాబును నిర్దోషిగా ప్రకటిస్తూ తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు మూడు నెలల క్రితం తీర్పు నిచ్చింది.

  • Loading...

More Telugu News