: హైద‌రాబాద్‌ను ఢిల్లీలా చూడాల‌నుకుంటున్న కేటీఆర్‌.. ట్వీట్‌లో వెల్ల‌డి!


ఢిల్లీలో క‌నిపించే చ‌క్క‌ని నున్నని రోడ్లు, స‌రిగ్గా ప‌నిచేసే జంక్ష‌న్లు, పార్కుల‌ను హైద‌రాబాద్‌లో కూడా చూడాల‌ని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఆశిస్తున్నారు. ఈ విష‌యాన్ని ఆయన త‌న ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు. ప్ర‌స్తుతం ఢిల్లీలో ఉన్న ఆయ‌న త‌న గ‌ది నుంచి క‌నిపిస్తున్న లొకేష‌న్ ఫొటోల‌ను ట్వీట్ చేశారు. `ఢిల్లీలో నా గ‌ది నుంచి క‌నిపిస్తున్న దృశ్యమిది. చ‌క్క‌ని నున్నని రోడ్లు, ప‌నిచేసే జంక్ష‌న్లు, పార్కులు.. ఇవే నేను హైద‌రాబాద్‌లో చూడాల‌నుకుంటున్నా. ఈ ట్వీట్ గురించి న‌న్ను ఆట‌ప‌ట్టిస్తార‌ని నాకు తెలుసు!` అని కేటీఆర్ ట్వీట్ చేశారు. ఆయ‌న అనుకున్న‌ట్లుగానే హైదరాబాద్ రోడ్ల ఫొటోల‌ను ఆయ‌న కామెంట్ సెక్ష‌న్‌లో కొంత‌మంది నెటిజ‌న్లు పోస్ట్ చేశారు.

  • Loading...

More Telugu News