: డ్రగ్స్ డీలర్ కమింగాకు 3 రోజుల సిట్ కస్టడీ
డ్రగ్స్ వ్యవహారంలో కీలక నిందితుడిగా అరెస్టైన నెదర్లాండ్ జాతీయుడు మైక్ కమింగాకు 3 రోజుల కస్టడీ విధిస్తూ సిట్ ఆదేశాలు జారీ చేసింది. కమింగా పట్టుబడిన రోజున అతని వద్ద 2.8 గ్రాముల డ్రగ్స్ దొరికినట్టు సమాచారం. తమ దేశంలో ఈ డ్రగ్‌పై నిషేధం లేకపోవడంతో తాను ఇక్కడికి తీసుకువచ్చినట్లు కమింగా వెల్లడించినట్లు తెలుస్తోంది. హైద్రాబాద్ యువతిని పెళ్లి చేసుకుని, ఇక్కడే స్థిరనివాసం ఏర్పరుచుకున్న కమింగా చాలా మంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు డ్రగ్స్ సరఫరా చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
కమింగా విచారణకు సహకరించడం లేదని సిట్ అధికారులు చెబుతున్నారు. ఏ ప్రశ్న అడిగినా తెలియదని చెబుతున్నాడని, అతని ల్యాప్‌టాప్ పాస్‌వర్డ్ కూడా చెప్పడం లేదని వారు తెలియజేశారు. అతని ఫోన్‌లో వందల మంది సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల నంబర్లు, వాట్సాప్ మెసేజ్‌లు లభించినట్లు సమాచారం. త్వరలోనే వీరిపై కూడా కేసులు నమోదు చేస్తామని సిట్ అధికారులు చెప్పారు.