: ఐదు వికెట్లతో చెలరేగిన అశ్విన్... 183 పరుగుల వద్ద ముగిసిన లంక తొలి ఇన్నింగ్స్!


కొలంబో టెస్టులో శ్రీలంక తొలి ఇన్నింగ్స్ ముగిసింది. టీమిడియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఐదు వికెట్లతో చెలరేగడంతో లంకేయులు స్వల్ప స్కోరుకే పెవిలియన్ చేరారు. తరంగ (0), కరుణ రత్నె (25) వికెట్లు కోల్పోయి ఓవర్ నైట్ స్కోరు 50 తో రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ మూడో రోజు బ్యాటింగ్ ఆరంభించిన శ్రీలంక జట్టులో డిక్ వెల్లా (51) అర్థ సెంచరీతో రాణించగా, మాథ్యూస్ (26) దిల్ రువాన్ (25), మెండిస్ (24) ఫర్వాలేదనిపించారు.

చండిమాల్ (10), డిసిల్వా (0), హెరాత్ (2), ఫెర్నాండో (0) విఫలమయ్యారు. దీంతో కేవలం 183 పరుగులకే శ్రీలంక ఆలౌటైంది. టీమిండియా బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ ఐదు వికెట్లతో రాణించగా, జడేజా 4 వికెట్లతో సత్తాచాటాడు. షమి రెండు వికెట్లతో ఆకట్టుకోగా, ఉమేష్ యాదవ్ ఒక వికెట్ తీశాడు. దీంతో రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో భారత జట్టు 439 పరుగులు వెనుకబడి ఉంది. 

  • Loading...

More Telugu News