: విజృంభించిన అశ్విన్, జడేజా... పీకల్లోతు కష్టాల్లో శ్రీలంక!


టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ విజృంభిస్తున్నాడు. కొలంబో వేదికగా జరుగుతున్న రెండో టెస్టుపై టీమిండియా పట్టుబిగిస్తోంది. ఓవర్ నైట్ స్కోరు 50తో రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ బ్యాటింగ్ ఆరంభించిన లంకను గింగిరాలు తిరిగే బంతులతో అశ్విన్ ఆటాడుకున్నాడు. ఈ క్రమంలో మెండిస్ (24), చండిమాల్ (10), మాథ్యూస్ (26), డిసిల్వా (0) వికెట్లు కోల్పోయారు. నిన్న సాయంత్రానికి తరంగ (0), కరుణ రత్నె (25) వికెట్లు కోల్పోయిన సంగతి తెలిసిందే. డిక్ వెల్లా (50) వన్డే తరహా ఆటతీరుతో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. దిల్ రువాన్ (7) ఆచితూచి ఆడుతున్నాడు. భారత బౌలర్లలో అశ్విన్ మూడు వికెట్లు తీయగా, జడేజా రెండు వికెట్లు, ఉమేష్ యాదవ్ ఒక వికెట్ తీశారు. దీంతో శ్రీలంక జట్టు 40 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. 

  • Loading...

More Telugu News