: పాతబస్తీలో కార్డాన్ సెర్చ్... చుట్టుముట్టిన 250 మంది పోలీసులు!


హైదరాబాదులోని పాతబస్తీ శివారు ప్రాంతాలైన అసద్ బాబానగర్, కిషన్ బాగ్ ప్రాంతాలలో దక్షిణ మండలం పోలీసులు కార్డాన్ సెర్చ్ చేపట్టారు. పాతనేరస్థులు తలదాచుకున్నారన్న సమాచారంతో తెల్లవారు జాము 5 గంటలకు 250 మంది పోలీసులు ఈ ప్రాంతాలను చుట్టుముట్టారు. ఉదయం 8 గంటల వరకు తనిఖీలు చేపట్టారు. ఈ కార్డాన్ సెర్చ్ లో 84 మందిని అదుపులోకి తీసుకుని వారి నుంచి 56 చోరీ వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

తనిఖీల సమయంలో కొందరి ఇళ్లల్లో యాసిడ్‌, కుళ్లిన బంగాళాదుంపలతో తయారుచేసిన కల్తీ అల్లం, వెల్లుల్లి పేస్టు డబ్బాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదకర రసాయనాలతో తయారుచేస్తున్న కల్తీ మెహందీ ప్యాకెట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న 84 మందిలో 20 మంది రౌడీ షీటర్లు, 23 మంది పాత నేరస్థులు ఉన్నారని పోలీసులు తెలిపారు. వారి నుంచి 4 కత్తులు, మద్యం సీసాలు స్వాధీనం చేసుకునట్టు పోలీసులు తెలిపారు. 

  • Loading...

More Telugu News