: ఫేస్ బుక్ ప్రియుడి కోసం తండ్రి కారు చోరీకి సహకరించిన యువతి!


ఫేస్‌ బుక్‌ ప్రియుడి కోసం తండ్రి కారును చోరీ చేసేందుకు యువతి సహకరించిన ఘటన చెన్నైలో కలకలం రేపింది. ఘటన వివరాల్లోకి వెళ్తే... చెన్నైలోని కోడంబాక్కం ప్రాంతానికి చెందిన పారిశ్రామికవేత్త షణ్ముగరాజన్‌ (47) తన కారు చోరీకి గురైందని చెబుతూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తులో ఆ కారును వ్యాసార్పాడి కల్యాణపురం ప్రాంతానికి చెందిన చంద్రు (28) అనే యువకుడు వాడుతున్నట్టు గుర్తించారు.

దీంతో అతనిని పట్టుకుని తమదైన శైలిలో విచారించారు. దీంతో షణ్ముగరాజన్‌ కుమార్తెతో తాను ప్రేమలో ఉన్నానని, డబ్బులు అడగడంతో తన తండ్రి కారును దొంగిలించి, విక్రయించడం ద్వారా వచ్చిన డబ్బును వాడుకోవాలని సూచించిందని, అంతే కాకుండా కారు చోరీలో కూడా సహాయం చేసిందని పోలీసులకు చెప్పాడు. దీంతో అతనిని అరెస్టు చేసిన పోలీసులు, రిమాండ్ కు తరలించారు. 

  • Loading...

More Telugu News