: వేడి నీటిని స్ట్రాతో తాగిన ఎనిమిదేళ్ల చిన్నారి.. గొంతు కాలి మృతి!


వేడి నీటిని స్ట్రాతో తాగిన ఎనిమిదేళ్ల చిన్నారి నోరు, గొంతు కాలడంతో శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారి మృతి చెందింది. అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిందీ ఘటన. తన కజిన్‌తో పందెం వేసిన బాలిక వేడి నీటిని స్ట్రాతో తాగినట్టు పోలీసులు తెలిపారు. గొంతు కాలడంతో శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారిన బాలికను ఆసుపత్రికి తీసుకెళ్లారు. చిన్నారిని పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. యూట్యూబ్‌లో ఓ వీడియో చూసి తాను కూడా అలా చేస్తానని తన వయసే ఉన్న కజిన్‌తో పందెం కాసి ఈ పనికి పాల్పడినట్టు బాలిక తల్లిదండ్రులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News