: 100 మీటర్ల క్వాలిఫైయింగ్ రేస్ ను విజయవంతంగా ముగించిన బోల్ట్... బ్లాక్స్ పై అసహనం!
100 మీటర్ల క్వాలిఫైయింగ్ రేస్ ను జమైకా చిరుత ఉసేన్ బోల్ట్ విజయవంతంగా ముగించాడు. రేసును ఆలస్యంగా ఆరంభించిన బోల్ట్ వేగంగానే ముగించాడు. క్వాలిఫై రౌండ్ అనంతరం బోల్ట్ బ్లాక్స్ పై అసహనం వ్యక్తం చేశాడు. తన జీవితంలో ఇంత చెత్త బ్లాక్స్ (స్పింటర్లు కాళ్లు అనించేవి, గన్ పేల్చగానే కాలుని వదిలే క్లిప్ బ్లాక్స్) ను చూడలేదని అసహనం వ్యక్తం చేశాడు. బ్లాక్స్ వల్ల రేసును అందరితో ప్రారంభించలేకపోయానని, కానీ అందరితో రేస్ ప్రారంభించి ఉండాల్సిందని చెప్పాడు.
రేస్ ఆరంభంలో అందరికంటే మూడు మీటర్లు వెనుకబడిన బోల్ట్ తన వేగంతో దానిని అధిగమించి, 10.07 సెకెన్లలో 100 మీటర్ల క్వాలిఫైయింగ్ రేస్ ను ముగించాడు. రెప్పపాటు వేగంతో తాను గెలవడం పట్ల బోల్ట్ అసహనం వ్యక్తం చేశాడు. బ్లాక్ పై మండిపడ్డాడు. ఫైనల్ రేసును బాగా ముగిస్తానని ఆశాభావం వ్యక్తం చేశాడు.