: మేము ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటాం, టీడీపీ ఓటమిపాలైతే అఖిలప్రియ రాజీనామా చేస్తారా?: శిల్పా సోదరుల ఛాలెంజ్


నంద్యాల ఉపఎన్నికలో తాము ఓడిపోతే కనుక రాజకీయాల నుంచి తప్పుకుంటామని, మరి, టీడీపీ ఓటమిపాలైతే భూమా అఖిల ప్రియ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా? అని శిల్పా సోదరులు మోహన్ రెడ్డి, చక్రపాణి రెడ్డి ప్రశ్నించారు. ఓ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వారు మాట్లాడుతూ, తమ సవాల్ ను స్వీకరిస్తారో లేదో అఖిలప్రియ చెప్పాలని, ఈ సవాల్ కు ఆమె ఒప్పుకుంటే తాము కూడా రెడీగా ఉన్నామని అన్నారు. నంద్యాల ఉపఎన్నికలో గెలుపు కోసం వైసీపీ రూ.50 కోట్లు ఖర్చుపెడుతోందంటూ వస్తున్న వార్తలపై వారు స్పందిస్తూ, అవన్నీ అబద్ధాలంటూ కొట్టిపారేశారు.  

  • Loading...

More Telugu News