: వెంకయ్యనాయుడి కీలక ప్రసంగాలతో పుస్తకం.. ఆవిష్కరించిన ప్రధాని మోదీ!


ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి, కేంద్ర మాజీ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు వివిధ సందర్భాలలో చేసిన కీలక ప్రసంగాలతో కూడిన ‘టైర్ లెస్ వాయిస్.. రిలెంట్ లెస్ జర్నీ’ పుస్తకాన్ని ప్రధాని నరేంద్రమోదీ ఈ రోజు ఢిల్లీలో ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని బీజేపీ ఎంపీ కంభంపాటి హరిబాబు రచించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, సీనియర్ నేత అద్వాని, పలువురు తెలుగు ఎంపీలు పాల్గొన్నారు. కాగా, ఉపరాష్ట్రపతి ఎన్నికలు రేపు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో వెంకయ్యనాయుడు కీలక ప్రసంగాలతో కూడిన పుస్తకాన్ని ఆవిష్కరించడం గమనార్హం.

  • Loading...

More Telugu News