: ఏదో ఫ్లోలో జగన్ అలా మాట్లాడారు: వైసీపీ నేత శిల్పామోహన్ రెడ్డి వివరణ
నంద్యాల బహిరంగ సభలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలు ఏదో ఫ్లో లో వచ్చాయే తప్పా, కావాలని చేసిన వ్యాఖ్యలు కాదని శిల్పా మోహన్ రెడ్డి అన్నారు. ఓ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, సీఎం చంద్రబాబును కాల్చేసినా తప్పులేదని జగన్ అన్నారే తప్పా, కాల్చేయమని అనలేదని అన్నారు. అలా అయితే, తాము నిర్మించిన రోడ్లు, తాము ఇస్తున్న పెన్షన్లు, తమ పథకాలను ఉపయోగించుకుంటున్న ప్రజలు టీడీపీకే ఓట్లు వెయ్యాలని ఇటీవల చంద్రబాబునాయుడు అనలేదా? అదీ తప్పుకాదా? అని ప్రశ్నించారు. ప్రసంగించేటప్పుడు ఏదో ఫ్లోలో అలాంటి వ్యాఖ్యలు వస్తాయని, వాటిని పట్టించుకోకూడదని, రాద్ధాంతం చేయకూడదని శిల్పామోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు.