: ఈ నెల 6, 7 తేదీల్లో ఏపీపీఎస్సీ గ్రూప్-3 మెయిన్స్


ఈ నెల 6, 7 తేదీల్లో గ్రూప్-3 మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నట్టు ఏపీపీఎస్పీ చైర్మన్ ఉదయభాస్కర్ తెలిపారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ నెల 6న ప్రకాశం, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాలు సహా హైదరాబాద్-1లోను, 7వ తేదీన విజయనగరం, తూర్పుగోదావరి, నెల్లూరు, కర్నూలు జిల్లాలతో పాటు హైదరాబాద్-2 లోని ఆయా పరీక్షా కేంద్రాల్లో గ్రూప్-3 మెయిన్స్ పరీక్షలు జరగనున్నట్టు చెప్పారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తమ ఫొటో గుర్తింపు కార్డులు తీసుకురావాలని తెలిపారు. ఈ సందర్భంగా గ్రూప్-2 పరీక్షా ఫలితాలు లీక్ అయ్యాయనే వార్త అసత్యమని ఉదయభాస్కర్ స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News