: మరణ ధ్రువీకరణకు 'ఆధార్'ను తప్పనిసరి చేసిన ప్రభుత్వం!
చనిపోయిన వారి వివరాలను నమోదు చేయడానికి ఆధార్ నంబర్ తప్పనిసరిగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అక్టోబర్ 1 నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని తెలిపింది. జమ్మూ కాశ్మీర్, అస్సాం, మేఘాలయ రాష్ట్రాలకు మినహా దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఈ నియమం వర్తిస్తుందని హోం మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఆధార్ గుర్తింపులో అవకతవకలను తొలగించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం చెప్పింది. మరణ నమోదులో ఆధార్ నంబర్ తెలియజేయడం ద్వారా అదే నంబర్‌తో మరో ఆధార్‌ను జారీ చేసే అవకాశం ఉండదని పేర్కొంది.